An unpredictable Pakistan stunned England by eight wickets to enter their maiden Champions Trophy final on Wednesday, continuing their sensational run in the tournament. Pakistani bowlers produced another professional performance to restrict the formidable England batting.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ ఇంగ్లండ్. దీనికి న్యాయం చేస్తూ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే సెమీస్ చేరింది. కానీ! అసలు సమరంలో బ్యాట్లెత్తేసింది.చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సంచలన విజయంతో పాకిస్థాన్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని ఆ జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ట్రోఫీలో తొలి నుంచి దుమ్మురేపుతున్న ఇంగ్లండ్ కీలక మ్యాచ్‌లో చతికిల పడింది.