The Himachal Pradesh Government has offered the post of DSP to Indian women's cricket team wicketkeeper Sushma Verma after the side's very impressive outing in the ICC World Cup.
మొన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ పుణ్యామా అని మన మహిళా క్రీడాకారుల కు చక్కటి గుర్తింపు వచ్చింది... చివరి వరకు పోరాడి...ఓడినా కోట్లాది భారతీయుల మనసులను గెలుచుకున్నారు... అయితే మన మహిళా క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నారు... తాజా గా ఐసీసీ మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఫైనల్ వరకు వెళ్లడంలో వికెట్ కీపర్‌గా తన వంతు కృషి చేసిన సుష్మా వర్మకు డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ పదవి ఇస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.