The Kerala High Court lifted the lifetime ban imposed on former India fast bowler S Sreesanth, paving the way for his return to competitive action.The 34-year-old was one of the playerscharged for spot-fixing during the 2013 IPL.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన నిషేధాన్ని కేరళ హైకోర్టు సోమవారం ఎత్తివేసింది. గతేడాది ఢిల్లీలోని ట్రయల్ కోర్టు కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పు తర్వాత తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని శ్రీశాంత్ బీసీసీఐని కోరినప్పటికీ బోర్డు తిరస్కరించింది. దీంతో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినా బోర్డు తనను కావాలని వేధిస్తోందని పిటిషన్ వేశాడు.