Anchor anasuya bharadwaj savaal to the arjun reddy team..about the bad words in the movie.
అర్జున్ రెడ్డి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఓ సంచలనం..ఈ సినిమా హంగామా క్రియేట్ చేస్తూనే వివాదాలనూ ఫేస్ చేస్తుంది .. ఆ వివాదాలు ఇప్పటికి కంటిన్యూ అవుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న యాంకర్ కం యాక్టర్ అనసూయ.. ఈ సినిమాలో అమ్మను తిట్టే బూతులు ఘోరం అంటూ.. ఆ మూవీని చూడలేనని చెప్పేసింది. అలాగే.. అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ బూతులు మాట్లాడడాన్ని ఆమె ఖండించింది. అయితే అనసూయ వాదనపై విమర్శలు.. ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి.