Hyderabad Metro rail project would bring new look for city. Project management has prepared so many plans for its passingers with modern facilities. Sky ways between metro rail stations and multi folded stares parking facility will be here.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మెట్రోరైల్ స్టేషన్లు సరికొత్త అందాలు తీసుకురానున్నాయి. సింగపూర్ వంటి దేశాల్లో మాదిరిగా ప్రయాణికులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 28వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.