It is said that Telangana minister Thummala Nageswara rao helped TBGKS win in yellandu and manuguru areas.
సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయంలో ఎంపీ కవిత అన్నీతానై వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ఖమ్మంలోని ఇల్లెందు, మణుగూరు ఏరియాలో గెలుపును నిర్దేశించింది మాత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనే చెప్పాలి. ఎందుకంటే.. మంత్రి తుమ్మల ఈ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించి టీబీజీకేఎస్ గెలుపునకు తన వంతు కృషి చేశారు.