Rain may play spoilsport in the third and final T20 international between India and Australia with weather forecast indicating possibility of light to moderate rain. The city has been receiving good rainfall almost on a daily basis for about a week, throwing normal life out of gear.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 రద్దు కావడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. అయితే, శుక్రవారం వర్షం పడకపోయినప్పటికీ, మైదానంలోని అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో పలుమార్లు పరిశీలించిన అంఫైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం హెచ్‌సీఏ నిర్లక్ష్యం కారణంగా తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ రద్దు అయిందని అభిమానులు మండిపడుతున్నారు.