బేగంపేట్ లో ఒక మహిళ హల్చల్ చేసింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనదారుల పైకి దుసుకెల్లింది. మితిమీరిన వేగంతో రోడ్డుపై మిగతా వాహనాదారులను బెంబేలెత్తించిన ఆమె.. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుల పైనే వీరంగం చేసింది. దీంతో వాహనదారుల కు మహిళకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆ మహిళ ఎందుకలా చేస్తుందో ఎవరికీ అర్ధం కాలేదు. అంతేకాదు అలా వేగంగా కారును నడుపుతూ అందర్నీ గుద్దుకుంటూ తిట్టుకుంటూ ఆ మహిళా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఖరీదైన కారులో వచ్చి ఆ యువతి చేసిన వీరంగానికి అందరూ షాక్ కి గురయ్యారు. ఇక వేగంగా వచ్చిన ఆ యువతి ఒక 2 వీలర్ ని గుద్దింది. ఆ 2 వీలర్ వ్యక్తి ఆమె కారు డోర్ తీసి ఆమెను ప్రస్నించటానికి ప్రయత్నించగా అతని మీద కూడా దాడి చేసింది ఆ యువతి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు పరిస్థితి గమనించి ఆపడానికి ప్రయత్నించినా ఆ యువతీ కంట్రోల్ అవ్వలేదు. పొలిసు ను కూడా తోసుకుంటూ తిట్టుకుంటూ ఆ యువతి అక్కడనుండి వెళ్ళింది. అయితే ఇంత చేసిన ఆ యువతీ పై ఏ విదమైన యాక్సన్ తీసుకునట్టుగా కన్పించలేదు.
Caught on Camera : Woman Rash Driving on Begumpet Roads and fight with some persons and traffic police even. she try to beat one Two Wheeler person also. Watch Video to know more