Latest news updates and today's trending News
1. పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 230 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది.
2. ఏపీ ప్రజలు ఎదురుచూసే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అమరావతి డిజైన్లపై సీఎం చంద్రబాబు బుధవారం సంతృప్తి వ్యక్తం చేశారు.
3. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నారంటే
మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు టిఆర్ఎస్‌తో పొత్తుకు సిద్ధమంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి అది ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో తనను ఇరికించి జైలుకు పంపించారనే ఆగ్రహం కేసీఆర్ పైన రేవంత్‌కు ఉందంటున్నారు.
4. జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని టిడిపి ప్రయత్నించడం లేదని, తమ పార్టీకి మేలుచేసే ఆ కార్యక్రమం జరగాలనే కోరుకుంటున్నామని మంత్రులు ఆదినారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు అన్నారు. పాదయాత్ర ముగియకుండానే ఈడీ ఎక్కడ ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు.