Kohli was also the first batsman to aggregate 1000 runs in one day internationals in 2017 and has so far scored 449 runs in Tests and 195 in T20Is this year. He now has 1460 runs from 26 ODIs in 2017.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 202వ వన్డేల్లో విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించాడు. కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో 83 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లీ ఈ ఘనత సాధించాడు. తద్వారా వన్డేల్లో 9 వేల పరుగులు చేసిన ఆరో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
కోహ్లీకి ముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజహరుద్దీన్, ధోని 9 వేల పరుగులు చేశారు. కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ తన 194వ ఇన్నింగ్స్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గతంలో 205 ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగులు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.