Both superstar Mahesh Babu and director Rajamouli have confirmed that they would team up for a film in near future. Well, going by the commitments of these two, the project won't materialize before 2020.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ ఇద్దరు స్టార్లు ఖరారు చేశారు. అయితే వీరి కాంబో మూవీ ఎప్పుడు వస్తుంది? అనే దానికి మాత్రం అసలు సమాధానం లేదు. మహేష్ బాబు, రాజమౌళి కమిట్మెంట్స్ ప్రకారం చూస్తే మరో రెండేళ్ల తర్వాతగానీ వీరి సినిమా వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంచేత ఈ సినిమా విషయంలో ఇప్పటి నుండే అభిమానులు అనవసరమైన ఆశలు, ఊహలు పెట్టుకోక పోవడమే మంచిది అనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 25వ మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2018లో మొదటి త్రైమాసికంలో ప్రారంభం కాబోతోంది.