Anchor Rashmi Gautham Sungs Populer Mass Song రష్మీ.. క్లాస్ కాదు మాసే..

Filmibeat Telugu 2017-10-31

Views 31

Jabardast Anchor and Actress Rashmi Gautham sungs Megastar Chiranjeevi's populer Mass Song "endi be ettaga undi Ollu" from his Movie Gharana Mogudu on Next Nuvve Movie Pramotions
.తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి.... అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ... సినిమాల్లో కూడా నటిస్తూ బాగానే పాపులర య్యిందీ గ్లామరస్ యంకర్.. అయితే యాంకర్‌గా అందాలు ఆరబోయటం, సినిమాల్లో మరీ సెక్సీగా కనిపించటమే కాదు నేను ఊర మాస్ అనే రేంజ్‌లో తనలో ఉండేమూడో కోణాన్ని కూడా బయటపెట్టింది ఎక్స్ట్రా జబర్దస్త్ బేబీ, తాజాగా ఆమె నటించిన 'నెక్ట్స్ నువ్వే' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా పాత పాటలంటే తనకెంతో ఇష్టమని, పాత పాటలు అద్భుతంగా ఉంటాయని ఆమె తెలుపుతుంటే.. ఏంటీ రష్మీయేనా మాట్లాడుతుంది అనుకున్నారంతా.
అయితే పాత పాటలంటే మరీ పాతవి అనుకుంటారేమో.. మెగాస్టార్ చిరంజీవి నటించిన పాటలంటూ మళ్లీ వస్తున్న డౌట్ క్లియర్ చేసింది. మరి చిరు చిత్రంలోని పాత పాటలంటే కాస్త క్లాసిక్ టచ్ ఉన్న పాటలేమో అని అనుకోవచ్చు. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది రష్మీ. 'ఘరానా మొగుడు' సినిమాలోని 'ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్లు..' అనే పాట అంటే రష్మీకి చాలా చాలా ఇష్టమని తెలిపింది. ఎంత ఇష్టమంటే.. స్పాట్‌లో ఆ పాట కూడా పాడేసింది. ఇది చాలు రష్మీ ఎంత ఊర మాసో తెలియడానికి.

Share This Video


Download

  
Report form