రాజశేఖర్‌పై ఫ్యాన్స్ కామెంట్.. కంటతడి పెట్టిన జీవిత

Filmibeat Telugu 2017-11-04

Views 2.9K

Praveen Sattaru's latest movie PSV Garuda Vega get super hit talk from the first show. Overseas reports of the movie very good. Hero Rajasekhar plays powerful super cop in this movie.
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌కు కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ చేరింది. యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపొందించిన పీఎస్వీ గరుడవేగ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. చాలా రోజుల తర్వాత సక్సెస్‌ను రుచి చూసిన రాజశేఖర్ ప్రస్తుతం ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నారు. విజయం అందించిన భావోద్వేగంలో జీవిత రాజశేఖర్ కన్నీరు పెట్టుకోవడం అభిమానులను కలిచివేసింది.
గురుడవేగ చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్‌ను కలెక్షన్లను సాధిస్తున్నది. ఓవర్సీస్ రిపోర్ట్స్ బాగా ఉండటం, సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా ట్వీట్లు చేయడం గరుడవేగకు కలిసివచ్చింది. గురుడవేగ చిత్రానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్‌, జీవితతోపాటు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఓ థియేటర్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా రాజశేఖర్ ప్రేక్షకులతో కలిసి పోయారు. తాను ఓ సాధారణమైన వ్యక్తిని అని అన్నారు. గరుడ సినిమాకు ప్రేక్షకులు సానుకూలంగా స్పందించడపై ఆనందం వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS