In case of Garuda Vega, Rajasekhar, Jeevitha, director Praveen Sattaru and few others came together to make the movie. They took Rs 3 crore as finance. Finally, Rajasekhar had to pledge his 5000 sq ft flat in a plush location to release his film.
దాదాపు పదేళ్ళ పాటు ఒక్క సక్సెస్ కోసం ఎదురు చూసాడు సీనియర్ హీరో.. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ టాలీవుడ్ అని పిలిపించుకున్న రాజశేఖర్ తర్వాతి కాలం లో మిగతా హీరోలతో సమానం గా రాణించలేకపోయినా.., తానుమాత్రం సినిమా మీద సినిమా ట్రై చేస్తూనే ఉన్నాడు
ఈ వయసులోనూ గరుడ వేగలో మళ్ళీ ఆనాటి ఉత్సాహం తోనే కనిపించిన రాజశేఖర్ ఈసారి మాత్రం హిట్ కొట్టాడు... అయితే ఈ హిట్ ముందు కూడా వరుస విషాదాలు.... కొన్ని రోజులకిందటే ఆయన తల్లి మరణం, సరిగ్గా రిలీజ్ ఒక్క రోజుముందు బావమరిది శ్రీనివాస్ మరణం ఈ సక్సెస్లోని ఆనందాన్ని తగ్గించేసాయి...
అయితే ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే గానీ ఒక వేళ ఏమాత్రం తేడా చేసినా ఈసారి కూడా రాజశేఖర్‌కి మళ్ళీ మూడుకోట్లకు పైగా నష్టం వచ్చేదట. అవును అది రెమ్యునరేషన్ లాస్ కాదు. సొంత ఆస్తిని కోల్పోవాల్సి వచ్చేది. నిర్మాత జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్, ఇంకా మరి కొందరు కలిసి తెరకెక్కించిన గరుడ వేగ సినిమా కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు.