YS Jagan Padayatra Schedule జగన్ పాదయాత్ర, నేటి షెడ్యూల్ ఇదే..

Oneindia Telugu 2017-11-06

Views 1.4K

AP Oppostion party YSRCP President YS Jagan's Padayatra begins from today from Idupulapaya
2019లో అధికారమే లక్ష్యంగా జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సిద్దమయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్ర సుమారు 3,000కి.మీ సాగనుంది. సోమవారం ఉదయం 9గం. ఇడుపాలయలో బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో జిల్లా స్థాయి నేతలంతా ఇడుపులపాయకు తరలుతున్నారు. పాదయాత్ర లక్ష్యాలు, ప్రభుత్వ వైఫల్యాల గురించి బహిరంగ సభలో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.
పాదయాత్ర సందర్భంగా ప్రజలంతా జగన్‌కు అండగా నిలబడాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరనున్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరే అవకాశం ఉంది.కాగా, రోజుకు 15కి.మీ చొప్పున పాదయాత్ర పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం, కడప పెదదర్గాను కూడా జగన్ సందర్శించారు. పాదయాత్రను విజయవంతం చేయాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆయన కోరుకున్నట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS