పవన్ కళ్యాణ్ పర్యటన : జగన్ కి పోటీనా ?

Oneindia Telugu 2017-11-06

Views 582

Jana Sena chief Pawan Kalyan may start Bus tour in next year in telugu States.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ యాత్ర ఎక్కడి నుంచి, ఎలా చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఓ వైపు జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. మరోవైపు పవన్ పాదయాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
పాదయాత్ర ద్వారా పవన్‌ జనానికి చేరువ కావాలా లేదా, బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలా అన్నది జనసేనలో ఇప్పుడు చర్చ సాగుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి పాదయాత్ర చేస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కోర్ కమిటీ ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తే పరిస్థితులు ఎలా ఉండవచ్చన్న దానిపై పూర్తి వివరాలను అందచేసినట్లుగా తెలుస్తోంది. పవన్‌ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించారట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS