India Post stamps are part of the postage on 24 different Indian dishes, including the famous Tirupati laddu. Andhra dishes — idlidosa and pongal have also been honoured with exclusive stamps.
హైద్రాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. హైద్రాబాద్‌కు వచ్చినవారెవరూ కూడ ఈ బిర్యానీ తినకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ బిర్యానీ మరో అరుదైన ఘనతను దక్కించుకొంది. బిర్యానీ ఇండియా స్టాంప్‌లపై దర్శనమివ్వనున్నాయి. హైద్రాబాద్ బిర్యానీ రుచి ఇతర బిర్యానీలకు ఉండదనే ప్రచారం కూడ ఉంది. విదేశీయులే కాదు ఇండియాలోని పలు రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు కూడ ఈ బిర్యానీ రుచి చూడకుండా వెళ్ళరు. ఏళ్ళ తరబడి ఈ బిర్యానీ తయారీ హైద్రాబాద్‌లో సాగుతోంది. ఈ బిర్యానీ తయారీ విధానం డిఫరెంట్‌గా ఉంటుందని చెబుతారు నిపుణులు. అయితే బిర్యానీ పేరు మీదనే హైద్రాబాద్‌లో హోటళ్ళు వెలిశాయి.