"It is very important for an actor to be shameless, should have no apprehensions, fearless and be 'bindass'," said Vidya balan.
బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించే హీరో..హీరోయిన్లు పాత్రలను పండించేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ఆయా పాత్రలకనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటుంటారు. నటన, డాన్స్, మాటకారి తనం ఇవన్నీ ఉండాల్సిందే. అయితే బాలీవుడ్ స్పెషల్ అట్రాక్షన్ అనదగ్గ హీరోయిన్ విద్యాబాలన్ మాత్రం అసలు ఇవన్నీ తర్వాత ముందు ఇక్కడికి రావాలంటే సిగ్గుండకూదదు అని చెప్పేసింది.సిగ్గులేకపోవటం అంటే మరీ బట్టలు వదిలెయ్యటం టైపుకాదు గానీ... మరీ ముడుచుకు పోయే తత్వం మాత్రం సరి పడదు అదే పెద్ద మైనస్ అవుతుందీ అని చెప్పింది. సిగ్గులేకుండా ఉండటం (షేమ్ లెస్ గా ఉండటం) ఒక యాక్టర్ కు చాలా ఇంపార్టెంట్. మొహమాటం... భయపడటం ఇక్కడ పనికిరావు.
ఇక్కడ బిందాస్ గా ఉండటం అలవాటవ్వాలి" అంటోంది విద్యాబాలన్. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ పాత్రలతోనే వచ్చిన విధ్యా మొదటినుంచీ మంచి యాక్టింగ్‌తో పాటు గ్లామర్ కి కూడా ఏలోటూ లేకుండా అందరినీ మెప్పించుకుంటూ నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన నటి ఒక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపించినా.
సిగ్గు.. బిడియం.. మొహమాటం వంటివి ఇండస్ట్రీకి ఎంత మాత్రం పనికిరావని కాస్తంత గట్టిగా చెప్పేసింది. సినిమా రంగమే కాదు.. ఎక్కడయినా ఆత్మవిశ్వాసమే కోరిన విజయాలను అందిస్తుంది. అందుకే విజయం కోసం ఎవరి దారి వాళ్లు వెతుక్కోవాల్సిందే అన్నది విద్యా బాలన్ మాట.