మహేష్ బాబు సోదరి సంచలన వీడియో

Filmibeat Telugu 2017-11-08

Views 4.1K

Superstar Krishna’s daughter Manjula Ghattamaneni made her debut as an actress and soon she had to restrict herself to production. On the eve of her birthday, she is out with a video which says ‘Follow your Heart’.
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఆయన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు సినిమా రంగంలో హీరోగాలు ఎంట్రీ ఇచ్చారు. నటులుగా తమ సత్తా నిరూపించుకున్నారు. వీరి దారిలోనే కృష్ణ కూతురు మంజుల కూడా సినిమా రంగం వైపు అడుగులు వేయాలనుకున్నారు. హీరోయిన్ కావాలని కలలు కన్నారు. అయితే అప్పటి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం ఆమె హీరోయిన్ కావడానికి అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా అప్పట్లో కృష్ణ అభిమానులు మంజుల హీరోయిన్ కావడాన్ని వ్యతిరేకించారని, ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణ కూడా తన కూతురును నటిగా పరిచయం చేసేందుకు ఇష్టపడలేదని అంటుంటారు.
నవంబర్ 8న తన పుట్టినరోజు సందర్భంగా మంజుల ‘మనసుకు నచ్చింది-ఫాలో యువర్ హార్ట్' పేరుతో వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయిగా తాను ఎన్నో కలలు కన్నానని, వాటిని నెరవేర్చుకోలేక పోయానని మంజుల చెప్పుకొచ్చారు.
నా కుటుంబ నేపథ్యం, తన తండ్రి అభిమానులు, ఇంకా కొన్ని పరిస్థితులు తన కలలు, ఆశలు నెరవేరకుండా అడ్డంకిగా మారాయని మంజుల ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
ప్రయాణం ముఖ్యమేకానీ, గమ్యం ముఖ్యంకాదు. నాలోని ప్రతిభను గుర్చించి దానికి తగిన విధంగా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. ఇపుడు మనసు చెప్పినట్టుగా నడవడం ప్రారంభించాను. విజయం సాధించాను అని మంజుల తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS