What Happend Between Trivikram And Devi sri త్రివిక్రమ్-దేవిశ్రీ మధ్య విబేధాలు

Filmibeat Telugu 2017-11-09

Views 3.9K

Trivikram roped Anirudh for his movie with Junior NTR. The news is roaming rounds that something has happened between the duo which is the reason Trivikram is not working with Devi. Recently, Devi wished Kamal on his birthday, but ignored Trivikram, whose birth day also falls on same day.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గతంలో నాలుగు సినిమాలకు కలిసి పని చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయం సాధించాయి. అయితే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసిన 'అ..ఆ' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారాడు. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు.
ఒకప్పుడు కలిసి వరుస సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్....మధ్య ఏదో విషయంలో విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ తన సినిమాలకు వేరే సంగీత దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలో ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమాకు పాటలు సమకూర్చే బాధ్యత కూడా అనిరుధ్‌కే అప్పగించారు త్రివిక్రమ్. దేవిశ్రీతో క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే త్రివిక్రమ్ అతడిని దూరం పెట్టారని టాక్.
ఇంతకాలం ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తకు పెద్దగా బలం లేదు. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇటీవల కమల్ హాసన్, త్రివిక్రమ్ ఓకే రోజు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.
కమల్ హాసన్‌ను విష్ చేసిన దేవిశ్రీ...... త్రివిక్రమ్‌ను విష్ చేయలేదు. మరి ఆయన మరిచిపోయారో? కావాలనే విష్ చేయలేదో? తెలియదు కానీ..... ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది.ఇదంతా చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది..చూద్దాం ఎమవ్తుందో..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS