AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-10

Views 2.3K

Ap Assembly sessions started on Friday without Ysrcp.Ysrcp legislature party decided not attend to Ap assembly winter session.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం హజరుకలేదు. అయితే ప్రతిపక్ష పాత్రను కూడ తామే నిర్వహిస్తామని అధికార పక్షం ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో టిడిపి, బిజెపి సభ్యులు మాత్రమే ఉన్నారు.
పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోలేదనే కారణాన్ని చూపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను దృష్టిలో ఉంచుకొనే వైసీపీ శాసనసభపక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని టిడిపి ఆరోపణలు చేసింది.
మరోవైపు వైసీపీ నేతలకు ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఇష్టం లేనందునే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని అధికారపక్షం ఎదురుదాడికి పూనుకొంది.అయితే అసెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫోన్ చేశారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు హజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రి నారాలోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తారని లోకేష్ చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS