NTR Biopic Controversies : ‘లక్ష్మీస్ వీరగ్రంథం’NTR ను అవమానించడానికే ?

Oneindia Telugu 2017-11-14

Views 1

YSRCP leader Lakshmi Parvathi on Tuesday fired at Kethireddy Jagadishwar Reddy for Lakshmi's veera grantham.

'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా తీయడం ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమేనని మండిపడ్డారు.
తనను అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నారని, ఎన్టీఆర్‌ను అగౌరపరిచేలా కొందరు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీయనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు పోటీగానే.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. ‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా తీస్తున్నారని ఆరోపించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన లక్ష్మీపార్వతి.. ఘాట్ వద్ద సమాధికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను, ఎన్టీఆర్‌ను అవమానించేలా, చరిత్రను వక్రీకరించి సినిమా తీయాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.
తన అనుమతి లేకుండానే తన జీవిత చరిత్రను ఎలా తీస్తారంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు. కేతిరెడ్డి లాంటి కొంతమంది పాపులు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించడంతో.. ఈ ప్రాంతమంతా అపవిత్రమైందని.. అందుకే పాలాభిషేకంతో శుద్ధి చేశామని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS