లక్ష్మీపార్వతి ఎలాంటిదో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ! అన్నగారి ధర్మపత్ని కాదు ? | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-17

Views 2

Kethireddy Jagadeswar Reddy fired at YSR Congress Party leader Laxmi Parvathi.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ప్రవర్తనలో మార్పు రావాలని, ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని కోరుతూ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గురువారం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని పూజించారు.
ఆ తర్వాత ఆమెలో మార్పు కోరుతూ ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్ర చేపట్టారు.
ఇందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలిలో గల ఎన్టీఆర్ శిలా విగ్రహాన్ని పాలతో కడిగి నివాళులు అర్పించారు అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమను ప్లాట్ ఫాంగాళ్లు అన్న లక్ష్మీ పార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చారో ప్రజలకు చెప్పాలని కేతిరెడ్డి నిలదీశారు.
లక్ష్మీపార్వతి పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రులో బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా, షూటింగ్ పోలీస్ వారు ఆపితే మా నిర్మాత నీకు ఫోన్ చేసి మిమ్మల్ని అర్థించాడని చెబుతున్నావని, షూటింగ్‌ను ఆపే శక్తి నీకు ఉంటే, మీరే వచ్చి ఆపవచ్చు కదా అని నిలదీశారు.ఆదివారం తమ చిత్రం ప్రారంభోత్సవం అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే లక్ష్మీపార్వతి తాను ఆత్మహత్య చేసుకుంటానని బంజారాహిల్స్ పోలీసులకు చెప్పారని కేతిరెడ్డి మండిపడ్డారు. కష్టాల కడలిని అనుభవిస్తున్నానని, మూడు ముళ్ల పెళ్లికి ముప్పై ఏళ్ల వైవిధ్యాన్ని అనుభవిస్తున్నానని మీరు మా నిర్మాతతో చెప్పలేదా అని నిలదీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS