Ivanka Trump.. the eldest daughter of America President Donald Trump is now the biggest defender for her father in politics and as well as administration. As a advisor to President..
ఇవాంకా ట్రంప్... అమెరికా అధ్యక్షుడి గారాలపట్టి. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ఇవాంకా అంటే ఏమిటో.. అటు అమెరికన్లకూ, ఇటు ప్రపంచదేశాలకూ అర్థమైపోయింది.
ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయనకు సలహాదారుగా ప్రభుత్వంలో చేరిన ఇవాంకా ఇపుడు అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు. ముఖ్యంగా రాజకీయంగా గానీ, ప్రభుత్వ నిర్ణయాలను గానీ ఎవరైనా విమర్శిస్తే వారిని దీటుగా ఎదుర్కొనే బాధ్యతను ఆమే నిర్వర్తిస్తున్నారు.
తండ్రి ట్రంప్ మాటలెంత మాస్‌గా ఉంటాయో ఆయన కుమార్తె ఇవాంకా మాటలు అంత క్లాస్ గా ఉంటాయి. అధ్యక్షుడికి సలహాదారు పదవిలో ఉన్న ఇవాంకా కర్తవ్యాలలో ఒకటి తండ్రిని ప్రతి విషయంలోనూ డిఫెండ్ చేయడం. స్వతహాగా టెలివిజన్ హోస్ట్ కావడం, ఫ్యాషన్ డిజైనర్ కూడా తోడవడంతో ఆమె మాటలకు అమెరికన్ సమాజం అట్రాక్ట్ అవుతోంది.. అర్థం పర్థం లేన నిర్ణయాలతో, వ్యాఖ్యలతో విమర్శల పాలవుతున్న ట్రంప్‌కు ఈ పెద్ద కూతురే పెద్ద రక్షణ కవచంగా మారింది.ఇవాంకా ప్రజెంటేషన్ చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. ఆమె మాటల్లో నేర్పరితనం ఉంటుంది. ఇవాంకా మాట్లాడుతుంటే నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆమె మాటల్లో వక్రభాష్యాలుండవు. మాట్లాడేటప్పుడు ఎలాంటి తొట్రుపాటుకూ గురికాదు. భవిష్యత్తులో ఆమె అమెరికా అధ్యక్ష రేసులోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తల్లి ఇవానాయే ఓ సందర్భంలో చెప్పారు.