After consumer products and other daily-use items, the government is now looking to reduce goods and services tax (GST) on consumer durables like washing machines and refrigerators from the current level of 28% as part of the next round of rationalisation.
కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే నిత్యావసర సరుకుల వస్తువుల జీఎస్టీ ధరలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. మరో వైపు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లపై కూడ పన్ను రేట్లను తగ్గించాలని భావిస్తోందని సమాచారం. జిఎస్టీని అమలు చేసిన తర్వాత ఆయా రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్పుటు చేర్పులు చేయాలని జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పలు స్లాబ్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఇటీవల గౌహతిలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. 28 శాతం పన్ను స్లాబ్‌లో కేవలం 50 శాతం వస్తువులను ఉండేలా నిర్ణయించారు. ఈ నిర్ణయం కారణంగా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. అయితే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందనే ప్రచారం కూడ లేకపోలేదు.