సంగీత కేసు : ఎన్నో అనుమానాలు, ఎంపీ మల్లారెడ్డి వ్యాఖ్యలపై వాగ్వాదం

Oneindia Telugu 2017-11-23

Views 1

MP and TRS leader Malla Reddy on Wednesday met sangeetha, who was protest at her husband residence from Sunday.

భార్య సంగీతను కొట్టిన మాజీ టీఆర్ఎస్ యువనేత శ్రీనివాస్ రెడ్డి కేసులో నిందితుడి తల్లిదండ్రులు బాల్ రెడ్డి, ఐలమ్మ, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టుకు ముందు హైడ్రామా చోటు చేసుకుంది. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి బోడుప్పల్‌లోని ఓ హోటల్లో ఇరు కుటుంబాలకు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇరు కుటుంబాల బంధువులతో సమావేశమయ్యారు. చర్చలు ఫలించకపోవడంతో సంగీత వద్దకు వెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.అత్తమామ, మరిది అరెస్ట్ విషయం తెలిసి సంగీత స్పందించారు. తాను మీడియా ముఖంగా వారితో మాట్లాడాలనుకున్నానని, వారిని తన ముందుకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కానీ వారు ఇప్పుడు అరెస్టయితే, కోర్టులో ప్రవేశపెడితే మాట్లాడటానికి వీలు కాదని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS