ఇవాంకా‌ తో పాటే మంచులక్ష్మి నా ?

Filmibeat Telugu 2017-11-27

Views 2.2K

Manchu lakshmi going to be particepate in Global Entrepreneurship Summit 2017, Hyderabad witha ivanka Trump

హైదారాబాద్ లో జరగబయే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్షిప్ సదస్సు ఇప్పుడు హాట్ టాపిక్, ఇటు రాజకీయాలనీ, అటు మీడియానే కాదు ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఈ సదస్సు ఒక కీలక చర్చ అయ్యింది. ఆ సదస్సులో మాట్లాడటానికి ఆల్రెడీ బిజినెస్ రంగం‌లో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయని గుసగుసలు వినిపించాయి.
అయితే ఎవరు వస్తున్నారో రారో ఖచ్చితమైన సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు. కాని.. ఎవరి పిఆర్ ఏజన్సీలు వారి స్టార్ లు వస్తున్నారంటూ పాపులర్ చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో లక్ష్మీమంచు వంతొచ్చింది. లక్ష్మి కూడా ఆ సదస్సులో మాట్లాడబోతోందట...
ఇప్పుడు తాజాగా అందిన అప్డేట్ ఏంటంటే.. #GES2017లో అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న వేళ.. ఆమె అధ్యక్షతన జరిగే ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడటానికి లక్ష్మీ మంచును పిలిచారట. ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి ప్యానలిస్ట్ గా వెళ్లే మంచు లక్ష్మి.. అక్కడ ఇవాంక ముంగిట స్పీచ్ ఇస్తోంది అంటున్నారు పిఆర్ వర్గాలు.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మాత్రం.. సదస్సు జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే అసలు టాలీవుడ్ నుండి ఎవ్వరినీ పిలవవట్లేదు అనుకున్నవేళ.. రామ్ చరణ్ పేరు వినిపించింది. మళ్ళీ చరణ్ రావట్లేదని మరో న్యూస్ వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS