Rachayitha movie audio launched yesterday at hyderabad. The audio is launched by hero jagapathi babu.
విద్య సాగర్ రాజు,సంచిత పదుకొనే,శ్రీధర్ వర్మ,వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం''రచయిత''దర్శకుడు విద్య సాగర్ రాజ్,కళ్యాణ్ దూలిపాళ్ళ నిర్మాత,షాన్ రెహమాన్ సంగీతం అందితున్న ఈ సినిమా సోమవారం నాడు పాటల రచయిత చంద్ర బోస్ ఇంట్లో హీరో,విలన్,జగపతి బాబు పాటలను విడుదల చేసారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ''జగపతిబాబు'' మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా పేరు''రచయిత'' ఈ పాటలు ఒక పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న 'చంద్ర బోస్'' గారింట్లో అతను కూర్చుని పాటలు రాసే స్థలంలో నుండే విడుదల చెయ్యటం సంతోషంగా వుంది,సినిమాకి పని చేసే అందరికి పేరు వస్తుంది కాని ఒక్క రచయితకి మాత్రం రాదు ఈ విషయం నాకు నచ్చదు,అందుకే ఈ రోజు ఇలా ఈ పాటలు విడుదల చెయ్యటం పాటకు,రచయితకు ఇచ్చిన గౌరవంలా భావిస్తున్న అంటూ ఒక చిన్న సినిమా బయటకు రాకుండా అసలు సినిమా ఉందా లేదా అనే పరిస్థితికి చిన్న సినిమా వెళ్ళినందుకు కొంత బాధను వ్యక్తం చేసారు.