Crime : ఇద్దరూ ఒకే మహిళతో!: సెప్టిక్ ట్యాంకులో శవమై ! | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-30

Views 3

Rajaiah, A liquor depo employee in Vijayawada was lost life in Tadepalli. His girlfriend made paln him with the help of another boyfriend.

బతుకుదెరువు కోసం వలసవెళ్లిన ఓ వ్యక్తి అక్రమ సంబంధం ఉచ్చులో చిక్కుకుపోయి బలైపోయాడు. అవసరం కోసం విచ్చలవిడి తనానికి అలవాటుపడ్డ మహిళ చివరాఖరికి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. తోటి కార్మికుడు తనకంటే ఎక్కడ పైకి ఎదుగుతాడేమోనన్న అక్కసు మరో కార్మికుడి చేత హత్య చేయించింది. మొత్తంగా ఒక్క హత్య ఆ ముగ్గురి కుటుంబాలను రోడ్డున పడేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరు ఎన్‌టిఆర్‌.కట్టపై హత్య ఘటనలో వెలుగుచూసిన విషయాలివి.తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దామవరపు మండలం రామకృష్ణాపురానికి చెందిన మార్కండి రాజయ్య(35) బతుకుదెరువు కోసం 10ఏళ్ల క్రితం విజయవాడ వచ్చాడు. స్థానికంగా ఓ లిక్కర్‌ డిపోలో ముఠా కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంకొండకు చెందిన సుధాకర్‌ కూడా అదే డిపోలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు.

Share This Video


Download

  
Report form