Former YSR Congress Party (YSRCP) MLA B Gurunath Reddy joined Telugu Desam Party (TDP) in the presence of Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu at his residence in Amaravati.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో ఆయనకు కండువా కప్పిన అధినేత టీడీపీలోకి ఆహ్వానించారు.గుర్నాథ్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎర్రిస్వామి రెడ్డి కూడా టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం నగరపాలక కార్పొరేటర్లు సుకూర్, మల్లికార్జున, సరోజనమ్మ, వెంకటరమణమ్మ, రుద్రంపేట సర్పంచి కాళ్యానాయక్ తదితరులు కూడా చేరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యేలు పీజే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ నేతలు జేసీ పవన్ కుమార్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. కాగా, గుర్నాథ్ రెడ్డి చేరిక వెనుక జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారని ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలు నిజమేనన్నట్లు జేసీ కూడా గుర్నాథ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు.