అఙ్ఞాతవాసి అక్కడ కూడా రిలీజ్ అట !

Filmibeat Telugu 2017-12-01

Views 769

Pawan Kalyan's much-awaited upcoming movie Agnathavasi under the direction of Trivikram Srinivas has become a hot topic in Tollywood. As per the latest flash, the movie is also going to get released in Kerala as well.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లతో పాటు ఇతర భాషల్లో కూడా పవన్ సినిమాకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. పవన్ త్రివిక్రమ్ సినిమా అఙ్ఞాత వాసి కోసం ఇప్పుడు మనోళ్ళే కాదు మలయాళీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. నిజానికి అక్కడికి ప్రవన్ రాక కాస్త ఆలస్యమే అయ్యింది. ఇప్పటికే అక్కడ అల్లు అర్జున్ లోకల్ హీరోలతో సమానమైన మార్కెట్ తెచ్చుకున్నాడు.
అల్లు అర్జున్ ని "మల్లు అర్జున్" అని ప్రేమగా ఓన్ చేసుకున్నారు మళయాలీ అభిమానులు, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రవేశం కూడా జనతా గ్యారేజ్ తో గట్టిగానే జరిగింది... ఆ తర్వాత పవన్‌ కాటమరాయుడు కేరళ వాసులకు గట్టి ఇంప్రెషన్ ఇచ్చింది. దాంతో... ఇప్పుడు రాబోయే సినిమా కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు...
ఇకపోతే కేరళలో కూడా పవర్ స్టార్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళంలో అజ్ఞాతవాసి డైరెక్ట్ గా తెలుగులో లేదా వీలైతే మళయాళ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుందట.
సాధారణంగా పవన్ యాక్షన్ సీన్స్‌ను మలయాళీ సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక అజ్ఞాతవాసిలో అలాంటి ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయట. ఇక పవన్ కాటమరాయుడుతో కేరళ లో కూడా భారీగానే క్రేజ్ తెచ్చుకున్నాడు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS