Chandrababu Alliance With Pawan Kalyan Before Breaking With BJP | Oneindia Telugu

Oneindia Telugu 2017-12-04

Views 1.9K

It is said that Andhra Pradesh CM Chandrababu Naidu will take more time before snapping the ties with the BJP, after firming up an alliance with Pawan Kalyan’s Jana Sena.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి, ప్రజలను సమీకరించుకోవడానికి తగిన వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుబ నాయుడు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగిన పునాదిని ఆయన తయారు చేసుకుంటున్నారు. పోలవరం వంటి ప్రధానమైన అంశాలపై ఆయన బిజెపిని చిక్కుల్లో పడేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైన చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది. అది జరిగినా జరగకపోయినా తనకు నష్టం కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడినట్లు భావించాల్సి ఉంటుంది. తన చేతుల్లో ఉన్నది చేశానని, ఇక చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన చెప్పే అవకాశాలున్నాయి. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS