RK Nagar Bypoll : Telugu Orgnisations May Support Vishal

Oneindia Telugu 2017-12-05

Views 469

Tamil Nadu Yuva Shakti leader Kethireddy Jgadeeswar Reddy said that Telugu orgnisations will take a decission wether to support Vishal or not at RK Nagar seat in Tamil Nadu

తమిళనాడులోని ఆర్కే నగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ హీరో విశాల్‌రెడ్డికి మద్దతు ఇచ్చే విషయంపై తెలంగాణ సంఘాలు ఆలోచన చేస్తున్నాయి.విశాల్ పోటీపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జయలలిత మరణించడంతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగుతుండడంతో విశాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే
ఆర్కె నగర్ స్థానం నుంచి ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు ఆ స్ధానంలో తెలుగు సంతతికి చెందిన సినీ హీరో విశాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
విశాల్ రెడ్డికి ఎన్నికలో మద్దతు ఇచ్చే అంశంపై తెలుగు సంఘాలన్నీ కలిసి చర్చించుకుని నిర్ణయం ప్రకటిస్తామని జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇదే ఉప ఎన్నికలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన అన్నా డిఎంకె అభ్యర్థి ఈ.మధుసూదన్ కూడా పోటీలో ఉన్నందున, ఆయనకు మద్దతు విషయంపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS