People of Tamil Nadu today are remembering Jayalalithaa on the first Commemoration Day of the late Chief Minister.
అప్పుడే ఏడాది గడిచిపోయింది. నేటితో జయలలిత కన్నుమూసి సంవత్సరం పూర్తయింది. అత్యంత నాటకీయ పరిణామాల నడుమ మిస్టరీ డెత్ గా ముద్రపడ్డ జయ మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు. వైద్య బృందాలు క్లారిటీ ఇచ్చినా.. ప్రభుత్వం జయలలిత చికిత్స వివరాలను వెల్లడించినా.. ఆ అనుమానాలు ఎప్పటికీ తొలగిపోయేలా లేవు. ఇదంతా పక్కనబెడితే.. జయ మరణం రాజకీయంగా తమిళనాడును ఎన్ని మలుపులు తిప్పుతుందో చూస్తూనే ఉన్నాం. జయలలిత అనుసరించిన నియంత పోకడలతో ఆమె ఉన్నన్నాళ్లు పార్టీలో మరో నేత ఎదగలేకపోయాడనేది వాస్తవం. ఆమె మరణం తర్వాత వారసుల పేరిట ఆ పేచీ మొదలైంది. ఇటు బయోలాజికల్ వారసులం తానేనంటూ అమృత అనే యువతి కూడా తెర పైకి వచ్చింది. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవించడం జయలలిత జీవితంలో అత్యంత చేదు అనుభవం. ఆమె మరణం తర్వాత ఐటీ అధికారులు జయలలిత సన్నిహిత వర్గాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఆమె కన్నుమూసిన వారం రోజులకే వీఐపీలతో పాటు ఏకంగా సచివాలయంలో, ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నివాసంలోనే సోదా లు చేపట్టింది. తమిళనాడు ప్రత్యేక రాష్ట్రంగా తర్వాత ఐటీ అధికారులు సచివాలయంలోకి అడుగుపెట్టడం అదే ప్రథమం.