కన్నడ సినీతారలు, క్రికెటర్లపై అర్జున్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Filmibeat Telugu 2017-12-06

Views 2

Arjun Reddy movie fame Vijay Devarakonda sensational comments on Kannada cricketers, film stars. He attended Ganesh movie Chamak audio release function as chief guest.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ఘన విజయాలతో క్రేజీస్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హవా దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీగానే నడుస్తున్నది. కన్నడ నటుడు గణేష్ నటించిన చమక్ చిత్ర ఆడియో ఆవిష్కరణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడియో ఆవిష్కరణ అనంతరం విజయ్ మాట్లాడుతూ కన్నడ ప్రముఖుల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసి ఆకట్టుకొన్నారు. విజయ్ ఏమన్నారంటే...
కర్ణాటక అనగానే రాహుల్ ద్రావిడ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ లాంటి ప్రముఖ క్రికెటర్లు వెంటనే గుర్తుకు వస్తారు. భారత జట్టులో ఎక్కువ మంది కర్ణాటక నుంచే ఉంటారు. ఒక్క క్రికెట్ కాదు.. ఏ రంగానికి చెందిన వారైనా అంకితభావంతో సేవలందిస్తారు.
సినిమాల గురించి ఆలోచించగానే బాహుబలి లాంటి చిత్రంతో పాపులర్ అయిన అనుష్కశెట్టి కర్ణాటక నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఇంకా సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లాంటి వారిని కూడా ఈ రాష్ట్రమే అందించింది. త్వరలోనే రష్మిక మందన కూడా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS