Modi’s statement on reservation quota : Shock to KCR and Chandrababu

Oneindia Telugu 2017-12-06

Views 471

PM Narendra Modi’s statement during campaigning in Gujarat on reservation quota decided by the Supreme Court cannot be overruled by political parties, has irked the governments of both Telangana and Andhra Pradesh.

రిజర్వేషన్లపై ప్రధాని మోడీ గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసినప్పటికీ అది తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందనేది స్పష్టమైంది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదనే సుప్రీంకోర్టును రాజకీయ పార్టీలు అతిక్రమించలేవని మోడీ అన్నారు. మోడీ ప్రకటన అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినే కాకుండా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా చిక్కుల్లో పడేసిందనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభల్లో బిల్లులను ఆమోదించాయి.
ముస్లింల రిజర్వేషన్లను నాలుగు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ, ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ బిల్లులను కెసిఆర్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదింపజేసుకుంది. దీంతో తెలంగాణ రిజర్వేషన్ల శాతం 62 శాతానికి పెరిగింది. కానీ, అవి అమలులోకి రావాలంటే కేంద్రమే చర్యలు తీసుకోవాలి. మోడీ ప్రకటనతో అవి అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.

Share This Video


Download

  
Report form