We all know about the allegations of assault made by several actresses against Hollywood heavyweight Harvey Weinstein. Richa Chadha, who is on a promotional spree these days for her upcoming film Fukrey Returns, was recently asked if a similar thing can happen in Bollywood too.
హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీల్లో సెక్సువల్ హరాస్మెంటు మీద చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తన తాజా సినిమా 'ఫక్రే రిటర్న్స్' ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రీచా చద్దా బాలీవుడ్లో సెక్సువల్ హరాస్మెంట్ పై స్పందించారు.
హాలీవుడ్ తరహాలోనే బాలీవుడ్లోనూ సెక్సువల్ హరాస్మెంట్ సంఘటనలు, కాస్టింగ్ కౌచ్ లాంటివి చోటు చేసుకుంటున్నాయని రీచా చద్దా తెలిపారు.
బాలీవుడ్లోని హీరోయిన్లు, నటీమణులు మొత్తం ఏకతాటిపైకి వచ్చి సెక్సువల్ హరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్ లాంటి వాటి మీద నోరు విప్పితే.... చాలా మంది హీరోలను మనం కోల్పోతాం. పలువురు తమ జీవితాలను, పనిని, లెగసీని కోల్పోతారు అని రీచా చద్దా సంచలన కామెంట్స్ చేశారు.