Beautiful Women Are Targeting Young Doctors !

Oneindia Telugu 2017-12-07

Views 840

Some beautiful women are targeting young doctors in Guntur and Vijayawada, Onglole Districts. First, they are coming as patients later they are trapping the doctors with their words, acts and finally taking huge amounts by blackmailing.

గుంటూరు విజయవాడలలో ఓ కొత్తరకం దందా నడుస్తోంది. అక్కడి యువ డాక్టర్లపై ఒక ముఠా అందాల వల విసురుతోంది.
డాక్టర్లను తమ వలలో వేసుకునేందుకు ఈ ముఠా అందమైన, ఆకర్షణీమైన అమ్మాయిలను ఎంచుకుంటోంది. వీరు తొలుత పేషెంట్ గా వచ్చి తమ అందాన్ని ఎరగా వేస్తున్నారు. అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని కల్లిబొల్లి కబుర్లు చెప్పి తమ అందాలను డాక్టర్ల ఎదుట ప్రదర్శించి వారిని కవ్విస్తున్నారు.
తరచూ డాక్టర్ల వద్దకు వస్తూ ఈ యువతులు వారితో పరిచయం పెంచుకుంటున్నారు. తమ రోగాలకు సంబంధం లేని కబుర్లు చెబుతూ, వారి వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ జాలి కలిగేలా ప్రవర్తించి ఇట్టే బుట్టలో వేసుకుంటున్నారు. తనకు పెళ్లయిందని, తన భర్త దూరంగా ఉంటూ నెలకోసారో, అర్నెల్లకోసారో వచ్చిపోతుంటాడంటూ ఆమె ఒంటరిగా ఉంటోందనే విషయాన్ని డాక్టర్ల బుర్రకు ఎక్కేలా చేస్తారు.
ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. బాగా పరిచయం పెంచుకున్న తరువాత, తమ ఆకర్షణలో పడ్డాడని తెలిసిన తరువాత.. బర్త్ డే పేరుతోనో, మరేదైనా సందర్భం సృష్టించో వారిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటికి రాగానే మరింత సన్నిహితంగా మెలుగుతూ, అవసరమైతే శృంగారం నెరపి మరీ బుక్ చేస్తున్నారు. వారి రాసలీలలను ఫొటోలు, వీడియోలు తీసి ఆ తరువాత బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS