YSR Congress party chief YS Jaganmohan Reddy talks about Sonia Gandhi, Sharmila, PM Modi and Bharathi.
జగన్ ప్రజా సంకల్ప యాత్ర బుధవారానికి నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకు ఇచ్చి న ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తండ్రి వైయస్ మృతి తర్వాత జరిగిన పరిస్థితులను వివరించారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఏర్పడిన వివాదానికి గల కారణాలను చెప్పారు. సోనియా తన ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని చెప్పారు. ఆమెకు తన గురించి లేనిపోనివి చెప్పారో లేక ఆమె మైండ్‌సెట్ మారిందో తెలియదు కానీ ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదన్నారు.
అసలు ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.
ఎన్నికల నాటికి వైసీపీలో జగన్ ఒక్కడే మిగులుతారని వ్యాఖ్యానించడంపై జగన్ స్పందించారు. అది మూర్ఖత్వం అన్నారు. నేను పార్టీ పెట్టినప్పుడు అమ్మ, నేను ఇద్దరమే అని, అప్పుడు తమది ఒక్కటే అసెంబ్లీ సీటు అని, ఇప్పుడు తమ వెంట ఎంతోమంది ఉన్నారని చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇది ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వాళ్లు ఎమ్మెల్యేలను కొంటూ తమపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.