"B.Tech Babulu" Movie Review By Filmibeat బీటెక్ బాబులు మూవీ రివ్యూ

Filmibeat Telugu 2017-12-08

Views 1

B.Tech Babulu is a Telugu movie starring Ashwini and Novel KIshore in prominent roles. The movie also stars Vizag Shankar and Shakalaka Shankar.

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు సెన్సేషనల్ విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో వస్తున్న చిత్రాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. పెళ్లిచూపులు, మెంటల్ మదిలో లాంటి ఫీల్‌గుడ్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బీటెక్ బాబులు అనే చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన నటీనటుల, దర్శకులు, ఇతర సాంకేతిక వర్గం చేసిన ప్రయత్నం ఇది. ఇందులో హీరో నందు, యాంకర్, హీరోయిన్ శ్రీముఖి అతిథి పాత్రలు పోషించారు. ఇలాంటి విశేషాలు ఉన్న బీటెక్ బాబు నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ఇంజినీరింగ్ కాలేజీలో నలుగురు యువకులు, ముగ్గురు అమ్మాయిల మధ్య చోటుచేసుకొన్న స్నేహం, ప్రేమ అంశాల మేలవింపే బీటెక్ బాబులు చిత్ర కథ. స్నేహంలో మధురానుభూతి, ప్రేమలో మనస్పర్థలు, కాలేజీ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను తెర రూపమే బీటెక్ బీటెక్ బాబులు చిత్రం.
మూడు ప్రేమ జంటల మధ్య వచ్చిన విభేదాలు ఏంటీ? వారి ప్రేమకు అడ్డంకిగా మారిన అంశాలేమిటి? ఈ కథలో నందు, శ్రీముఖ కథేంటి? షకలక శంకర్, తాగుబోతు రమేశ్, ఆలీ కథకు ఎలా ఉపయోగపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బీటెక్ బాబులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS