సాహో అంత ఆలస్యమా..? | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-09

Views 304

prabhas saaho movie release date may be delayed, according to latest report sahoo will release on 2019 because of delay in VFX work

బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన "బాహుబలి" సినిమాల అనంతరం ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' దేశవ్యాప్తంగా క్రేజ్‌ నెలకొంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటిలోనూ ఈ సినిమాపై చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం కొంచెం రెస్ట్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో దుబాయ్ లో కొన్ని యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి సాహో టీమ్ రెడీ అవుతోంది. అయితే ముందుగా అనుకున్న డేట్ ప్రకారం కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ పూర్తవ్వకపోవచ్చు అనే టాక్ బాగా వినిపిస్తోంది.
అయితే, వీఎఫ్‌ఎక్స్‌ మిక్సింగ్‌ కోసం కొంచెం ఎక్కువ సమయం పడితే.. 2019లో ఈ సినిమా వచ్చే అవకాశముంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
ట్రాన్స్‌ఫార్మర్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్‌ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్‌ సీక్వెన్స్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఎక్కువగా నార్త్ కు చెందిన నటీనటులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ప్రముఖ నటుడు షెడ్యూల్ కారణంగా సినిమా ఆలస్యంగా స్టార్ట్ అవబోతోందని టాక్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS