గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, వీడియో !

Oneindia Telugu 2017-12-16

Views 62

A case has been registered against Telangana BJP MLA Raja Singh following his provocative speech at the Virat Hindu Samavesh convention in Yadagiri on Thursday evening.

హైదరాబాద్ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కొత్తేమీ కాదు, గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో జరిగిన హిందూ విరాట్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రతీ హిందువు తన ఇంట్లో ఖడ్గాన్ని సిద్ధం చేసుకోవాలని, మత వ్యతిరేకులపై అవసరం ఏర్పడినప్పుడు ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క కత్తితో మనం ఏమీ చేయలేం. మనకు మరిన్ని కావాలి. అవసరం ఏర్పడితే మతం కోసం చంపేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
5వేలమంది హిందువులను మతమార్పిడి చేయడమే కాకుండా ఆలయాలను ధ్వంసం చేసిన టిప్పు జయంతి ఆచరణపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల ఓట్ల కోసమే ఇటువంటి జయంతులు జరిపారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను కర్నాటక పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కర్ణాటక నార్త్ ఈస్ట్రన్ రీజియన్ ఐజీ మీడియాకు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS