ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో..: విజయ్ అక్రమసంబంధాలపై ఫొటోలు సంచలనం | Oneindia Telugu

Oneindia Telugu 2017-12-16

Views 66

New twist in vijay sai case. his wife Vanitha reddy releases two photos of vijay with other girls on Saturday.

నటుడు విజయసాయి ఆత్మహత్యకేసులో రోజుకో విషయం బయటపడుతోంది. తాజాగా విజయసాయి భార్య వినతారెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించేవాడని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను కూడా వనితారెడ్డి బయటపెట్టడం గమనార్హం.
తన ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో విజయసాయి గడిపేవాడని వనితా రెడ్డి ఆరోపించారు. ఆ అక్రమ సంబంధాలపై నిలదీసినందుకే తనపై విజయసాయి దాడి చేశాడని వనిత తెలిపింది.
అక్రమ సంబంధాల నేపథ్యంలోనే తాను విజయసాయిని వదిలిపెట్టి వెళ్లిపోయానని వనిత ఆరోపించారు. అందుకే ఆయనకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నానని వనిత చెప్పారు. అంతేగాక, పలువురు అమ్మాయిలతో విజయసాయి ఏకాంతంగా ఉన్న ఫొటోలను ఆమె బయటపెట్టారు.
విజయ్ చనిపోయాక తాను ఎక్కడికి పారిపోలేదని వనిత తెలిపారు. తన బిడ్డ భవిష్యత్ తనకు ముఖ్యమని అన్నారు. తన అత్తామామలు కూడా తనను పట్టించుకోవడం లేదని అన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఆస్తులు లాగేసుకున్నారని, తనకు సినిమా, టీవీల్లో అవకాశాలు రావడం లేదని అన్నారు. తన బిడ్డను ఎలా పోషించుకోవాలని అన్నారు. తనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అని వనిత ప్రశ్నించారు.తాను తప్పు చేయలేదని, తనకు పారిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. విజయసాయికి సంబంధించిన అక్రమ సంబంధాల ఫొటోలు, వీడియోలతో తాను పోలీసుల ముందుకు వస్తానని వనితా రెడ్డి చెప్పారు. మీడియా తనకు సహకరించాలని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS