Minister Talasani Srinivas Yadav talking about artists ahead of World Telugu Conference.
ప్రపంచ తెలుగు మహా సభలు : కళాకారుల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల్లో !
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహా సభల కోసం రవీంద్రభారతి వేదికగా ఘనంగా ఏర్పాట్లు చేసారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రవీంద్రభారతిలోని కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినిమా రంగమే కాదు, ప్రతి కళాకారునికి ప్రోత్సాహం ఇవ్వటమే కాదు, ప్రతి ఒక్కరికి ఉపాది కల్పించే ప్రయత్నాలు కుడా చేస్తున్నాం అంటూనే ఈ విధంగా ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకోని ప్రతి కళాకారున్ని గౌరవించడం జరుగుతుంది, ఈ కార్యకమం పైన వస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోబోదు, వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడాలేదు అని స్పందించారు. కాగా ప్రపంచ తెలుగు మహా సభలు నిన్న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే ! ఇక 19 వ తేది వరకు ఇవి జరగనున్నాయి.