First ever video of J Jayalalithaa inside Apollo hospital released by TTV Dinakaran.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతున్న సందర్బంలో అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ వర్గం చాకచక్యంగా వ్యవహరించింది. అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సందర్బంలో తీసిన వీడియో బుధవారం విడుదలైయ్యింది. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సందర్బంలో ఆమెను ఎవ్వరూ చూడలేదని ప్రచారం జరిగింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్బంలో వీడియోలు తీశామని ఇంత కాలం శశికళ నటరాజన్ వర్గం ప్రచారం చేసింది.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యే వెట్రివేల్ బుధవారం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేశారు. ఆసుపత్రిలో బెడ్ మీద పడుకుని ఉన్న జయలలిత స్వయంగా జ్యూస్ తాగుతున్న వీడియో తీశారు. జయలలిత స్వయంగా జ్యూస్ తాగుతున్న వీడియోను బుధవారం టీటీవీ దినకరన్ వర్గం నాయకుడు వెట్రివేల్ విడుదల చేశారు. జయలలిత ఒక్కరే జ్యూస్ తాగుతున్న వీడియో విడుదల చేసిన టీటీవీ దినకరన్ వర్గం ఏం ప్లాన్ వేసింది అనే విషయం ఎవ్వరికీ అర్థకావడం లేదు.