నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు ! మామూలుగా కాదు, ఘోరం !

Oneindia Telugu 2017-12-22

Views 2

A 23-year-old woman was set near her house in Shanthi Nagar at Lalaguda here late on Thursday. The victim, identified as Sandhya Rani, a private employee was doused with kerosene and set on the road by a man.

నగరంలో గురువారం జరిగిన దారుణ ఘటన విషాదాంతమైంది. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో నడుచుకుంటూ వెళ్తున్న సంధ్యారాణిపై కార్తీక్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున సంధ్యారాణి మృతి చెందింది. సంధ్యా రాణి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... బాధితురాలు నేరెడు సంధ్యారాణి(22) తల్లి సావిత్రి, సోదరులు, అక్కతో లాలాగూడలోని భజన సమాజంలో నివాసముంటోంది. శాంతినగర్‌లోని ఓ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది.
కాగా, రెండేళ్ల నుంచి నిందితుడు కార్తీక్‌తో సంధ్యారాణికి పరిచయం ఉంది. ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేశారు కూడా. అయితే, గత కొంతకాలంగా ఉద్యోగం మానేసిన కార్తీక్.. చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో సంధ్యారాణి.. కార్తీక్‌ను దూరం పెట్టింది. అయితే, ప్రేమ, పెళ్లి అంటూ సంధ్యారాణిని కార్తీక్ వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు కార్తీక్. దుకాణంలో పని పూర్తయ్యాక గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సంధ్యారాణితో కార్తీక్ గొడవకు దిగాడు. ఆ తర్వాత ముందె తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS