గతి లేని స్థితిలో టాప్ హీరో భార్య !

Filmibeat Telugu 2017-12-24

Views 3

Actress and Shruti Haasan mother Sarika was literally left homeless, after the death of her mother recently. As per the will of Sarika's mother the entire property including a flat in Mumbai have been bequeathed to her family friend Dr. Vikram Thakur.

కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక గురించి బాలీవుడ్ సర్కిల్ నుండి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఉండటానికి ఇల్లు కూడా లేని దీనమైన స్థితిలో ఉన్నారని, మాజీ భర్త కమల్ హాసన్, కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా పట్టించుకోక పోవడంతో ఆమె పరిస్థితి గమనించిన అమీర్ ఖాన్ సహాయం అందించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
2004లో కమల్ హాసన్‌తో విడిపోయిన తర్వాత నుండి సారిక ముంబైలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఇటీవలే సారిక తల్లి చనిపోయింది. ఆమె మరణం తర్వాత సారికకు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోయిందని తెలుస్తోంది.
అమీర్ ఖాన్ సోదరికి సారిక బెస్ట్ ఫ్రెండ్. సారిక పరిస్థితి చూసి చలించిపోయిన అమీర్ ఖాన్... తన వంతు సహాయం చేశారని, ప్రస్తుతం ఆమె ఉండటానికి సహాయం చేసినట్లు తెలుస్తోంది. తన ఆస్తి తనకు రావడానికి సారిక కోర్టులో పోరాడుతున్నట్లు సమాచారం.
మాజీ భర్త కమల్ హాసన్... ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర్ హాసన్ ఉండగా అమీర్ ఖాన్ సహాయంతో ఉండాల్సిన దుస్థితి ఏమిటి? వీరు ఆమెకు సహాయంగా నిలవలేదా? అనే సందేహాలు సినీ జనాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS