Janhvi is all set to make her big screen debut opposite Ishaan in Shashank Khaitan's Dhadak, which is inspired by the Marathi blockbuster Sairat, Rumour has it that Janhvi and Ishaan have more than just a professional relationship. meanwhile, speculation is rife that Sridevi will make a special appearance in Dhadak as Janhvi's onscreen mother. Dhadak is set to hit the screens on July 6, 2018.
శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి సినిమా బాలీవుడ్‌లో ఒక్కంటంటే ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ జాహ్నవిపై లెక్కలేనని పుకార్లు వస్తున్నాయి. అయితే వాటిని శ్రీదేవి కుటుంబం పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించడం లేదు. తాజాగా దడ్కన్ చిత్ర హీరో ఇషాన్ కట్టర్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు వస్తున్న నేపథ్యంలో ఓ డిన్నర్ పార్టీకి ఇద్దరు కలిసి రావడం మీడియా కంటపడింది.
మరాఠిలో ఘనవిజయం సాధించిన సైరత్ చిత్ర రీమేక్‌లో ఇషాన్, జాహ్నవి నటిస్తూ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభానికి ముందే వీరిద్దరూ సినిమాలకు, డిన్నర్ డేట్స్‌కు వెళుతూ కనిపించారు.
అయితే ఎక్స్‌ట్రా అఫైర్లపై కాకుండా కెరీర్‌పై దృష్టిపెట్టాలని షాహిద్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే దడ్కన్ సినిమా పూర్తయ్యే వరకు జాహ్నవి అర్ధరాత్రి పార్టీలకు వెళ్లవద్దని జాహ్నవిని దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.