2018 బన్నీదే.. అమీర్ ఖాన్ తరువాత బన్నీ నే !

Filmibeat Telugu 2018-01-05

Views 454

Lagadapati Sridhar "Naa Peru Surya" press meet. Naa Peru Surya with subtitle Naa Illu India is a 2018 Telugu language action film produced by Sirisha and Sridhar Lagadapati under Ramalakshmi Cine Creations banner, written and directed by Vakkantham Vamsi.

అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వక్కతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్ , బ‌న్నీవాసు, కె.నాగ‌బాబు నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో నిర్మాత శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' టీజర్ చూసిన వారంతా గూస్ బంప్స్ వచ్చాయని చెబుతున్నారు. సినిమా హిట్టవుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. ఇంత టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు, కేవలం 29 గంటల్లోనే కోటి హిట్స్ రావడం ఆనందంగా ఉంది. బన్నీ మీద ఇంత ప్రేమ కురిపించి, టీజర్‌ను హిట్ చేసిన అందరికీ థాంక్స్' అని నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు.
సినిమా పర్ఫెక్ట్‌గా రావడం కోసం బాలీవుడ్‌లో బాగా శ్రమించేది ఆమిర్ ఖాన్.... ఆ తరువాత తెలుగులో ఆ స్థాయిలో తన పాత్ర పర్ఫెక్షన్ కోసం తపించేది అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. దేశభక్తితో పాటు అల్లు అర్జున్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి..... అని శ్రీధర్ లగడపాటి తెలిపారు.
బాహుబలి స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ‘నా పేరు సూర్య' సినిమా ఉండబోతోంది, 2018 సంవత్సరం బన్నీదే కాబోతోంది. ఆ నమ్మకం మాకు ఉంది అని చెప్పుకొచ్చారు.
సినిమా 70 శాతం పూర్తయింది. ఈ నెల వ‌చ్చే నెల్లో క‌లిపి దాదాపు 40 రోజులు చిత్రీక‌రిస్తే సినిమా పూర్త‌వుతుంది. సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నామని శ్రీధర్ లగడపాటి తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS