తరగతి గదిలోనే.. విద్యార్థిని మెడలో తాళి కట్టిన బాలుడు, వీడియో వైరల్ ! video viral

Oneindia Telugu 2018-01-05

Views 14

Watch A boy tied thali to a minor girl in tamilnadu : video gone viral on social media

బాల్య వివాహాలు నేరం అని తెలిసినా అవి ఆగడం లేదు. తాజాగా తరగతి గదిలోనే ఓ విద్యార్థిని మెడలో బాలుడు తాళికడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
29 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలో తాళి పట్టుకుని 'అమ్మా' అంటూ మొబైల్ వైపు చూస్తాడు. ఆ వెంటనే 'తాళి కట్టరా' అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తుంది.
ఆ వెంటనే స్కూలు యూనిఫాం ధరించి ఉన్న సదరు బాలిక మెడలో ఆ బాలుడు తాళి కట్టేశాడు. అసలీ జంట ఎవరు? ఈ పెళ్లి ఎక్కడ జరిగిందన్న దానిపై వివరాలేమీ లేవు.
ఆ విద్యార్థిని ముఖం స్పష్టంగా కనిపించకుండా ఈ వీడియో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తుండడంతో బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ జంట కోసం ముమ్మర గాలింపు మొదలుపెట్టారు. దీనిపై బాలల హక్కుల సంరక్షణ సంస్థ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. వీడియోలో కనిపిస్తున్న బాలిక ప్రభుత్వ పాఠశాల యూనిఫాం ధరించి ఉందని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థినులూ అదే యూనిఫాం ధరిస్తారు కాబట్టి ఈ ఘటన ఏ స్కూలులో జరిగిందో కనుక్కోవడం కష్టతరంగా మారిందని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS